ఆటపాక గ్రామ సభలో వివిధ అభ్వృద్ధి కార్యక్రమాల మీద వినతిపత్రాలు అందించిన మదన్, విజయ్, సతీష్.

జాన్ పేట యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Madhan Kummarikunta , నవయాన్ బుద్ధిష్ట్ సొసైటీ ప్రెసిడెంట్ Vijay Kumar Vangalapudi, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ Satish Kumar Kunavarapu గార్లు ఈరోజు జరిగిన ఆటపాక పంచాయతి గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్ గారికి EO గారి ద్వారా జాన్ పేట గ్రామ సమస్యల పైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

1. బుద్ధ విహార్ ( బుద్దుని ధ్యాన మందిరం, అంబేద్కర్ knowledge సెంటర్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, హెల్త్ సెంటర్) నిర్మాణానికి స్థల సేకరణ, అనుమతులు కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
2. ఆటపాక – 2 సచివాలయ పరిధిని ఆటపాక గ్రామం నుంచి వేరు చేసి ప్రత్యెక పంచాయతి చేయాలి.
3. గ్రామంలో బహిరంగ బహిర్భూమి నిషేదించడానికి మొదటి అడుగుగా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించాలి.
4. గ్రామంలో CC రోడ్ల నిర్మాణానికి, వాటర్ ట్యాంక్ నిర్మాణం గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.