Navayan Buddhist Society మరియు John Peta Youth Association నుంచి 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఇంతకి నవయాన్ అంటే ఏమిటి?
నవయాన్ బుద్ధిస్ట్ సొసైటీ navayan.org ( జాన్ పేట గ్రామం లో బుద్ధిస్ట్ గ కన్వర్ట్ అయిన వారి కోసం బుద్దుని ధ్యాన మందిరం కట్టడానికి ఏర్పటు చేసిన ట్రస్ట్ ) మరియు
అంబేద్కర్ Knowledge సెంటర్ ( కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, మరియు రీడింగ్ రూమ్ ) – జాన్ పేట గ్రామంలో విద్యార్ధులకు, యువతకు కంప్యూటర్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ కంప్యూటర్ కాన్సెప్ట్స్ నేర్పించడానికి ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్.
అంబేద్కర్, బుద్దుడి జీవిత సారం మొత్తం ఒక్కటే జ్ఞాన సమపార్జన, మనిషిగా వ్యక్తిగత ఎదుగుదల – వారి చూపిన బాటలోనే గుడి అంటే కేవలం ఆధ్యాత్మిక అవసరాలే కాకుండా జ్ఞానం, వ్యక్తిగత అభివృద్ధికి కేంద్ర బిందువులుగా వుండాలి అనే సంకల్పంతో ఏర్పాటు చేస్తున్నవే ఈ బుద్దుని ధ్యాన మందిరం మరియు అంబేద్కర్ Knowledge సెంటర్ పై రెండు కుడా జాన్ పేట గ్రామంలో ఒకే ఆవరణలో నిర్మించబడి జాన్ పేట యూత్ అసోసియేషన్ (జాన్ పేట గ్రామ అభివృద్ధి కమిటీ) johnpeta.org ద్వారా నిర్వహించబడతాయి.
ఇదే కాన్సెప్ట్ ముందు ముందు మరిన్ని దళిత గ్రామాలకు చేరవేయాలి అనేదే నవయాన్ బుద్దిస్ట్ సొసైటీ సంకల్పం కుడా.
ముందు ముందు వీటి గురించి మరింత సమాచారం అందిస్తాం.
జై ఇన్సాన్.
#Navayan #JohnPeta #Ambedkar #Buddha #AmbedkarKnowledgeCenter